మెగాస్టార్ పై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలను ఖండించిన పెంటేల బాలాజీ

చిలకలూరిపేట: చిరంజీవి పై కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన నాయకులు పెంటేల బాలాజీ ఖండించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైస్సార్సీపీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు కేవలం పవన్ కళ్యాణ్, చిరంజీవి గారి కుటుంబాన్ని కించపరిచే విధంగా మాత్రమే మాట్లాడుతున్నారు కానీ అభివృద్ధి మీద మాట్లాడమే లేదు, భోళా శంకర్ మూవీ ఈవెంట్ లో ఆంధ్రప్రదేశ్ మంత్రులు పిచ్చుకలపై బ్రహ్మాస్త్రంలా సినిమా వాళ్లపై పడుతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడమని, రోడ్ల సంస్యలపై మాట్లాడాలి, ఉద్యోగాల గురుంచి మాట్లాడాలి కానీ సినిమా వాళ్ళ రెమ్యూనరేషన్ గురుంచి కాదని సూచించారు, కొడాలి నాని మాట్లాడుతూ సినిమా హీరోలోని పకోడీగాళ్ళుగా అభివర్ణించడం తగదని, అలానే నాదెండ్ల మనోహర్ గారిపై చేసిన వ్యాఖ్యలను బాలాజి తప్పుబాట్టారు. వైస్సార్సీపీ లో గుడివాడలో నీకు ఓటమి తప్పదు కాబట్టి, పార్టీ మారాలన్నా టిడిపిలో స్థానం లేదు కాబట్టి జనసేన ఒక్కటే నీకు దిక్కు, పవన్కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం నువ్వు ఎంతో వెంపరలాడుతున్నావ్ నువ్వు మంచిగా మారి చొక్కా గుండీలు పెట్టుకుని, పాన్ పరాగ్ మానేసి, పేకాట క్లబ్ లు మానేసి సవ్యంగా మాట్లాడటం నేర్చుకుని మా చిలకలూరిపేటకురా నేను పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ ఇప్పిస్తానని పెంటేల బాలాజి అన్నారు. పేర్ని నాని గురుంచి మాట్లాడుతూ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఒక్క మీ మచిలీపట్నం నియోజకవర్గంనకు మాత్రమే 4.75 కోట్లు మంజురు చేసిన విషయం మరిచి నువ్వు చిరంజీవి గారిని దూషించడం నీ అవివేకంగా మేము భావిస్తున్నాం అని బాలాజి విమర్శించారు. పోలవరం గురుంచి అడిగితే పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురుంచి, సినిమా కలెక్షన్ గురుంచి మాట్లాడే అంబటి రాంబాబుకి మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదని బాలాజి ఘాటుగా స్పందించ్చారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మండల అధ్యక్షులు కొసన పిచ్చియ్య, చిలకలూరిపేట మండల నాయకులు తిమ్మిశెట్టి కోటేశ్వరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి అచ్చుకోల ఎల్ బి నాయుడు, యడ్లపాడు మండల ఉపాధ్యక్షులు మల్లా కోటి, పట్టణ నాయకులు పగడాల వెంకటేశ్వరావు, తోటకూర అనిల్, యడ్లపాడు మండల కార్యదర్శి బొందలపాటి సుబ్బారావు పాల్గొన్నారు.