గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈనెల 25వ తేదీ నుండి సెప్టెంబర్ రెండో తేదీ వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా, గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ మరియు అఖిల భారత చిరంజీవి యువత, తిరుపతి పార్లమెంట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో రక్తదాన శిబిరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తదానం సామాజిక బాధ్యత అనే దృక్పథం ప్రజల్లో కల్పించేందుకు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రక్తదాన శిబిరాల ద్వారా తమ సేకరించిన రక్తపు నిల్వలను నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి అందజేయడం జరుగుతుందని తెలిపారు. వారం రోజులపాటు జరిగే ఈ సేవా కార్యక్రమాల్లో జనసేన పార్టీ శ్రేణులు మెగా బ్రదర్స్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు ఇంద్రవర్థన్, గూడూరు మండలం అధ్యక్షులు పారిచెర్ల భాస్కర్, నాయకులు నాగార్జున, ఇమ్రాన్, విష్ణు, సాయి, సనత్, సూర్య, అశోక్, ఓంకార్, మనోజ్, శివ, విష్ణు, అనూప్, కుమార్, శ్రీనాథ్, మోహన్, శంకర్, చిన్న తదితరులు పాల్గొన్నారు.