గజపతినగరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలు

గజపతినగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మర్రపు సురేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలు నిర్వ్హినచనున్నారు. ఈ సందర్భంగా మర్రాపు సురేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులకు వీర మహిళలకు, జనసైనికులకు, మెగా అభిమానులకు అందరూ వచ్చి జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను, కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. తేది:27/8/2022 నుండి 2/9/2022 వరకు వారం రోజులపాటు జన్మదిన వారోత్సవాలు ప్రతిరోజు ఒక కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. మొదటి రోజు మొక్కలు నాటే కార్యక్రమం, రెండవ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు మరియు పండ్లు పంపిణీ, మూడవరోజు మెగా రక్తదాన శిబిరం, నాలుగో రోజు అన్నదానం కార్యక్రమం, ఐదవ మెగా వైద్య శిబిరం, (పాతబగ్గం గ్రామంలో), అరవ రోజు సర్వమత ప్రార్థనలు, ఏడవ రోజు జన్మదిన మెగా బైక్ ర్యాలీ, కేక్ కటింగ్ మరియు ఊరేగింపుతో పుట్టినరోజు వేడుకలు. అనంతరం మధ్యాహ్నం భోజనం. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు, గజపతినగరం నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.