రామగుండం జనసేన ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

రామగుండం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ సూచనల మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం నియోజనవర్గంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు రావుల మధు మరియు రావుల సాయి కృష్ణ అధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులతో అల్పాహారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా బావన కార్మికుల సంగం జిల్లా అధ్యక్షులు యాదయ్యతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు రావుల మధు మరియు రావుల సాయి కృష్ణ రామగుండం నియోజకవర్గం నాయకులు మేకల రాజకుమార్, ఏముర్ల రంజిత్, గోలి మహేందర్, లోకేష్, రాకేష్, ఆశ్రీత్, నరేష్ జనసైనికులు పాల్గొన్నారు.

  • గోదావరిఖని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ సూచనల మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం నియోజనవర్గంలో రామగుండం నియోజకవర్గ నాయకులు మోతె రవికాంత్ అధ్వర్యంలో గోదావరిఖని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నార్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు రావుల మధు మరియు రావుల సాయి కృష్ణ రామగుండం నియోజకవర్గం నాయకులు మేకల రాజకుమార్, ఏముర్ల రంజిత్, గోలి మహేందర్, లోకేష్, రాకేష్, ఆశ్రీత్, నరేష్ జనసైనికులు పాల్గొన్నారు.

  • తబిత ఆశ్రమంలో జనసేనాని జన్మదిన వేడుకలు

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ సూచనల మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం మండల నాయకులు తీగుట్ల నరేష్ మరియు నంది అజయ్ అధ్వర్యంలో తబిత ఆశ్రమంలో కేక్ కటింగ్ చేసి అనాధ పిల్లలకు రైస్ బ్యాగ్, పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నాయకులు రావుల మధు మరియు రావుల సాయి కృష్ణ, అంతర్గాం మండల నాయకులు, పవన్, అఖిల్, శశికుమార్, సుమంత్, అభి, స్వామి, కుమార్, అజయ్, శ్రీకాంత్, అనిల్ జనసైనికులు పాల్గొన్నారు.