జనసేన భీమ్ యాత్రకు శ్రీకారం

కాకినాడ: జనసేన భీమ్ యాత్రని ఆదివారం ఉదయం జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పిట్టజానకిరామారావు నాయకత్వంలో కాకినాడ సిటీ ఇన్చార్జ్ పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారీ బహిరంగ సభ పెట్టిన కాకినాడ పి ఆర్ కాలేజీ గ్రౌండ్ నుండి మట్టిని సేకరించి, అనంతరం ఇంద్ర పాలెం వంతెన వద్ద ఉన్న మహనీయుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి డాక్టర్ పిట్ట వరప్రసాద రావు సంఘీభావం తెలియజేయడం జరిగింది. అనంతరం దళిత వీరమహిళలు దళిత నాయకులు జనసేన పార్టీ అభిమానులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పిట్ట జానకి రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి ప్రతి దళితవాడలోనూ తిరిగి వారికి దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని అవగాహన కల్పించడం జరుగుతుందని అలాగే దళితవాడలో సేకరించిన సంతకాలతో మరియు ప్రతి అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి సేకరించిన మట్టిని తీసుకుని డిసెంబర్ 6వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత మహిళ నేతలు దళిత నాయకులు జనసేన శ్రేణులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.