పవన్ కళ్యాణ్ సీఎం కావాలని 300 కిలోమీటర్లు పాదయాత్ర

తిరుపతి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని, తెలంగాణలో పోటీ చేస్తున్న అన్ని జనసేన స్థానాలు కచ్చితంగా గెలవాలని, ఈనెల 14న అహోబిలం నుంచి (300 కిలోమీటర్లు) కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం తిరుమలకు పాదయాత్రగా బయలుదేరి సోమవారం తిరుపతికి చేరుకున్న జనసేనశ్రేణులు. ఈ సందర్భంగా తిరుపతి జనసేన నాయకులు పాదయాత్రగా తిరుమలకు చేరుకున్న ఆళ్లగడ్డ నియోజకవర్గం, అహోబిలం జనసేన సీనియర్ నాయకులు దేవా ఆంజనేయులు, ముచ్చుమరి ప్రసాద్, బడేగళ్ళ షరీఫ్ లను శాలువాతో సత్కరించి, మీ ఆశయం ఖచ్చితంగా నెరవేరుతుందని వారికి మద్దతు తెలియజేసి విందు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జనసేన నాయకులు సుమన్ బాబు, హేమంత్, రమేష్ నాయుడు, హిమవంత్, గుట్టా నాగరాజ, హేమకిరణ్, పురుషోత్తం, నవీన్ తదితరులు పాల్గొన్నారు.