జనసేన ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

  • అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు

ముధోల్: భైంసా పట్టణంలోని భవిత విలీన విద్యా కేంద్రంలో శుక్రవారం జనసేన పార్టీ నాయకులు దివ్యాంగుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు, దివ్యాంగుల సంఘం జిల్లా నాయకులు బురుగుల రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మొట్ట మొదటి సంతకం ఆరు గ్యారంటి లపై చేయగా, రెండవ సంతకం దివ్యాంగురాలు అయినటువంటి రజినికి ఉద్యోగంపై సంతకం చేయడాన్ని సంతోషిస్తూ, భవిష్యత్తులో వారికి అన్ని సంక్షేమ పథకాల్లో, రాజకీయాల్లో అర్హులుగా చేర్చి ఆదుకోవాలని, అదేవిధంగా ప్రజా ప్రతినిదులు, అధికారులు ఎవరైనా సరే వారిని అవమాన పరిస్తే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఐ ఈ అర్ పి సునీల్, ఐకేపి ఏపియం లక్ష్మణ్, సిబ్బంది మండల విద్యాదికారి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.