జనసేన ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పోరాటం

కాకినాడ సిటి: కాకినాడ సిటి జనసేన కార్యాలయంలో పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో పత్రికావిలేఖరుల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లడుతూ కాకినాడ నగరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పర్యటించి 67 ఏళ్లు అయిన సందర్భంగా ఆయన సమాధి ఉన్న ముంబైలోని చైత్ర భూమి వద్ద కాకినాడ నుండి సేకరించిన మట్టిని కలిపామని సుమారు లక్షలాది మంది నివాళులు అర్పించే ఆ పవిత్ర ప్రదేశంలో కాకినాడ నుండి తీసుకువెళ్ళిన అంబేద్కర్ నడయాడిన మట్టిని ఉన్న కలశాన్ని బౌద్ధ భిక్షువుల కోరికతో ఎన్నడూ జరగనిది తొలిసారిగా ఉంచి జనసేన పార్టీకి గొప్ప గౌరవాన్ని కలుగచేసినందుకు తమ కృతజ్ఞతలు తెలియచేస్తున్నామన్నారు. అక్కడ సైతం వారు తమ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురించి లండన్ లో ఆయన అంబేడ్కర్ గారి స్మారకాన్ని సందర్శిచడం లాంటి అనేక అంశాలను చెప్పడం చాలా సంతోషమేసిందన్నారు. ఈ స్పూర్తిని ముందుకు తీసికెళ్ళుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నేటినుండీ 60 రోజుల పాటు బడుగు, బలహీన, శ్రామిక వర్గాల తరపున ప్రజా చైతన్య పోరాటాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాము ప్రజల కష్టాలమీద, సమస్యలమీద పోరాటం చేస్తామే తప్ప వ్యక్తిగతమైన వివాదాల జోలికి పోయి సమస్యలని నిర్లక్షం చేయమనీ, అది ఎలా అంటే నేడు ఈ వై.సి.పి నాయకులు కాకినాడ సిటిలోని 28 వేల ప్రజలను అనధికారికంగా నగరబహిష్కారం చేసి వేరే గ్రామలలో నివాసయోగ్యం కాని ప్రాంతంలో ఇల్లు మంజూరు చేసారనీ అవి పూర్తిగా కట్టి వారి చేతికి అందాలంటే రాబోయే ఎన్నికలలో వై.సి.పి పార్టీని నెగ్గించాలని వత్తిడి చేస్తు భయబ్రాంతులకి గురిచేస్తూ ప్రచారం చేస్తున్నారనీ, కానీ కొద్దిరోజులలో ఏర్పడే తమ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఆధ్వర్యంలో నివాసయోగ్యం కాని ఆ ప్రాంతానికి బదులు నగరంలోనే ఇచ్చేలా ఏర్పాటు చేస్తామని తెలియచేసారు. ఇలా అనేక రకాల సమస్యలు కాకినాడ సిటిలో ఉన్నాయనీ వాటీన్నింటిపైనా జనసేన పార్టీ ప్రజలను చైతన్యపరుస్తూ పోరాటం చేస్తుందని తెలుపుతూ అనంతరం ప్రజా చైతన్య పోరాటం గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జనసేన కాకినాడ సిటీ ఉపాధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, చోడిపల్లి సత్యవతి, బండి సుజాత, సబ్బే దీప్తి, మిరియాల హైమావతి, వాడ్రేవు లోవరాజు, దూలపల్లి ఉమా, బోడపాటి మరియ, పచ్చిపాల మధు, చీకట్ల శ్రీనివాస్, ముత్యాల దుర్గాప్రసాద్, తుమ్మలపల్లి సీతారాం, మనోహర్ గుప్తా, యేలేటి సోనీ ఫ్లోరెన్స్ తదితరులు పాల్గొన్నారు.