మలిశెట్టి ఆధ్వర్యంలో పవన్ అన్న ప్రజా బాట 133వ రోజు

రాజంపేట నియోజకవర్గం: సుండుపల్లి మండలం, రాయవరం పంచాయతీలో పలు గ్రామాలలో కావలి పల్లి, సీనేపల్లి, బొంగొలపల్లి, జంగంపల్లి, రచపల్లి, కుడువాండ్ల పల్లిలో 133వ రోజు పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమాన్ని రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ, వాటిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని ప్రజలు జనసేన తెలుగుదేశం పార్టీకి ప్రజలు నీరాజనాలు అర్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు జగన్ రెడ్డి పరిపాలన విసుగెత్తి ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపిపార్టీ మద్దతుదారున్ని ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, చౌడయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, జనసేన వీరమహిళలు సుగుణమ్మ, లక్ష్మమ్మ, పోలిశెట్టి రజిత, శిరీష, మాధవి తదితరులు పాల్గొన్నారు.