భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ కి హామీ యాత్ర

కాకినాడ సిటిలో, జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ కి హామీ యాత్రా కార్యక్రమం పేర్రాజుపేట ప్రాంతంలో అగ్రహారం సతీష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడి వారి కష్టాలపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి చూస్తుంటే ఇంత కాలం గడిచినా భవన నిర్మాణ రంగ కార్మికుల జీవితాలు బాగుపడలేదనీ మొత్తం గందరగోళ పరిస్థితి అలాగే ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ వైసిపి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలవల్ల, స్వార్ధ ప్రయోజనాలకోసం ఇసుక విధి విధానాల వల్ల కార్మికుల దగ్గరనుండీ వారిపై ఆధారపడి ఉన్న వివిధ రంగాలు సైతం దెబ్బతిన్నాయన్నారు. కేవలం అక్రమ సంపదన కోసం మొత్తం కార్మికుల కడుపు కొట్టిన పాపం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. చివరికి నిన్న రాష్ట్ర హైకోర్ట్ రాజమండ్రి గోదావరి తీరం వద్ద ఇసుక పెద్ద పెద్ద యంత్రాలతో అక్రమంగా తవ్వేయడం పై వ్యాఖ్యలు చేసి అరెస్టులు చేయట్లేదెందుకని ప్రశ్నించడం చూసామన్నారు. అందుకే భవన నిర్మాణ కార్మికుల శ్రేయస్సు కోసం జనసేన పార్టీ తెలుగుదేశంలు ఉమ్మడి మేనిఫెస్టోలో ముఖ్యమైన ప్రతిపాదనలు చేపడుతున్నాయని కార్మికులకు వివరించి భరోసా తెలియచేసారు. ఈ కార్యక్రమంలో గరగ శ్రీనివాస్, నగేష్, దుర్గ, ఆనంద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.