జలుమూరు గ్రామ పంచాయితీలో బలగ ప్రవీణ్ కుమార్ పర్యటన

జలుమూరు మండలం, జలుమూరు గ్రామ పంచాయితీ పరిధిలో జనసేన ఇంఛార్జి బలగ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. గ్రామములో ఉన్నటువంటి యువకులతో సమావేశమై స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వినతి పత్రాన్ని తీసుకున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తరువాత తప్పని సరిగా సమస్యలు పరిష్కారానికీ కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో జనసేన ఇంఛార్జి బలగ ప్రవీణ్ కుమార్, ఆ పార్టీ నాయకులు రుక్కు శ్రీరామమూర్తి, యోగ హరి, ఎన్ తిరుపతిరావు, జలుమూరు గ్రామ జనసైనికులు, బేరి వసంత్, ఎం. ఆనందరావు, పి లక్ష్మీపతి, వై సింహాచలం, వై కుమార్ మరియు యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.