పవన్ కళ్యాణ్ చెప్పిన వారికే పని చేద్దాం: బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు హాట్ కామెంట్స్ చేసారు. ఆదివారం ఆన మీడియా ముఖంగా మాట్లాడుతూ పొత్తులో భాగంగా మంగళగిరిలో చెప్పాడు రెండువాళ్ళు ప్రకటించారు కాబట్టి రెండు మనం ప్రకటించామనీ, అలానే రేపు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి కూర్చొని ఒక టేబుల్ లో కూర్చొని అభ్యర్థుల్ని ప్రకటిస్తేనే వాళ్ళని ఉమ్మడి అభ్యర్థులుగా భావించి వాళ్ళని భుజాన ఎత్తుకొని గెలిపిస్తాం. కానీ అలాంటిది లేకుండా మాకు ఎవరో చెప్పారు మీ జెండాలు మోయండి, ఎత్తండి అంటే మనకు అవసరం లేదు. మాకు ఏదైనా పవన్ కళ్యాణ్ చెప్పాలి దానికి మేము కట్టుబడి ఉంటాం. ఆ పార్టీలో ముఖ్యమైన వాళ్ళు చెత చెప్పంచుకొని చేయమంటే కుదరదు. పవన్ కళ్యాణ్ నిర్ణయం చేసే వరకు, ప్రకటించే వరకూ మన పని మనదే, మన జెండా నిలబెట్టుకోవాలి. మన పార్టీ కోసం పనిచేయాలి మన పార్టీ నిలబెట్టుకోవాలి దాన్ని అందరు దయచేసి అర్థం చేసుకుని మన పార్టీ కోసం మన పని చేద్దాం. పవన్ కళ్యాణ్ ఏ పని చెప్తే ఆ పని చేద్దాం, ఎవరికి ఓటు వేయమంటే వారికి చేద్దాం. అప్పటి వరకు ప్రతి గ్రామంలో కూడా ప్రతి వార్డులో కూడా తిరిగి జనసేన పార్టీని అన్నయ్య చెప్పినట్లు ఒకటిలో మూడు వంతు కావాలి మన జనసేనకు కావాలి. అన్నింటిలో కావాలి గ్రామానికి ఎంపిటిసి ఉంటారు. జడ్పిటిసి ఉంటారు మన పార్టీ మనకు గొప్ప మన పార్టీ జెండా మనదే. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి హోదా ఇప్పించాలి. మనం అందరం కష్టపడి పనిచేసి ఆయనకు ముఖ్యమంత్రి హోదా ఇప్పించాలి. అదే మన ఆయనకు ఇచ్చే అవార్డు అని మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న అందరికి ధన్యవాదాలు.