జనసేన – గ్రామబాట

పార్వతీపురం నియోజకవర్గం, గోపాలపురం గ్రామంలో జనసేన పార్టీ కార్యక్రమాలు నిర్వహణ జిల్లా కార్యదర్శి చిట్లి గణేష్ మరియు గోపాలపురం జనసైనికుల ఆధ్వర్యంలో నిర్వహించిన “జనసేన – గ్రామబాట” కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు మరియు పార్వతీపురం నియోజకవర్గ జనసేన-టిడిపి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆదాడ మోహన్ పాల్గొని గోపాలపురం గ్రామ ప్రజలతో మమేకమై రాబోయే జనసేన – తెదేపా ప్రభుత్వం చెయ్యబోయే పలు మంచి కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే పలు పార్టీల నుంచి 25 కుటుంబాలను జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మండల అధ్యక్షురాలు ఆగూరు మణి, బలిజిపేట మండల అధ్యక్షులు బంకురు పోలినాయుడు, బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, పార్వతీపురం నాయకులు కాతా విశ్వేశ్వరరావు, రాజాన రాంబాబు, గొర్లి చంటి, కర్రి మణికంఠ, రెడ్డి కరుణ, నాని, ప్రవీణ్, సీతానగరం మండల నాయకులు పోతల శివశంకర్, బొండాడ గణేష్, వెంకట రమణ, విజయనగరం జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి గార గౌరీ శంకర్, బొబ్బిలి నాయకులు యందవ సత్య, చీమల సతీష్ తదితర జనసేన నాయకులు మరియు గోపాలపురం తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.