గ్రంథాలయం కోసం 31 గంటలకు పైగా నిరవధిక నిరాహార దీక్ష

బొబ్బిలి, పేద విద్యార్థులకు న్యాయం జరగాలి అనే ఒకే ఆలోచనతో, గ్రంథాలయ పనులు వెంటనే ప్రారంభించాలని ఒకే లక్ష్యంతో,జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాలూరు బాబు 31 గంటలకు పైగా, నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఇతని దీక్షకు అన్ని ప్రధాన ప్రతిపక్షాలు సంఘీభావం తెలియజేశారు. అయితే ఇప్పటికే 6.6 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించామని, రేపటి నుంచి పూర్తిస్థాయిలో పనులు జరిపిస్తామని, మున్సిపల్ అధికారులు ఆయనకు తెలియజేయడంతో ఆయన దీక్ష విరమించారు. ఆయనతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా ఈ దీక్షలో పాల్గొని ఆయనకు సంఘీభావం తెలిపారు.