ఒకే వేదికపై 3229 జంటలకు వివాహం .. వరల్డ్ రికార్డ్స్ లో చోటు !

చత్తీస్ గఢ్ లో ప్రభుత్వం ఓ గొప్ప కార్యాన్ని ఘనంగా జరిపించింది. ఒకే వేదికపై ఒకే ముహూర్తానికి ఒకేసారి 3229 జంటలకు వివాహాలు జరిపించింది. చత్తీస్ గఢ్ సీఎ కన్యా వివాహ్ యోజనలో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ సామూహిక వివాహాలు గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కాయి. రాయపూర్లో జరిగిన సామూహిక వివాహా కార్యక్రమానికి ముఖ్యమంత్రి భూపేశ్ బఘేలా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం.. వారికి శుభాకాంక్షలు అందజేశారు. రాయ్ పూర్ లో 233 మంది జంటలకు వివాహం జరిపించారు. ముస్లిం క్రైస్తవ జంటలు సైతం వారివారి ఆచారాల ప్రకారం వివాహాలు చేసుకున్నారు. ఈ అరుదైన అపురూపమైన దృశ్యానికి చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ ఇండోర్ స్టేడియం వేదికగా మారింది. హిందూ క్రైస్తవులు ముస్లింలు బౌద్ధులు ఇలా పలు సంప్రదాయాలు పలు సంస్కృతుల మధ్య ఈ సీఎం భూపేశ్ భగేల్ సాక్షిగా 3229 జంటలు ఒక్కటయ్యాయి.నూతన దంపతులకు ప్రభుత్వం తరఫున కానుకలు రూ.1000 నగదును సీఎం అందజేశారు. సీఎం సమక్షంలో ఒక్కటైన జంటలు ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. కొత్త దంపతులకు రాయ్ పూర్ కు చెందిన కమలేశ్ చోప్రా అనే వ్యక్తి వంటపాత్రలు అంకిత్ గాంధీ అనే వ్యక్తి చేతిగడియారాలను అందజేశారు. ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి భూపేశ్ సత్కరించారు.

చత్తీస్ గఢ్ లోని 22 జిల్లాల్లో మొత్తం 3229 జంటలకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఈ సామూహిక వివాహాలను జరిపించారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో వివాహాలు జరగడం ఇదే తొలిసారి కాగా గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి చేరింది. కొత్త జంటలను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి బాఘేల్ మాట్లాడుతూ.. పవిత్రమైన మాఘ పౌర్ణమి రోజున వధూవరులు వివాహంతో ఒక్కటయ్యారు. ఒకేసారి బారతి ఘరతి రెండూ అయ్యే అవకాశం లభించడం మన భాగ్యం. కన్యాదానం కంటే గొప్ప ధర్మం మరొకటి లేదు.. మాఘ పౌర్ణమి రోజున చేసినప్పుడు దీనికి మరింత ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అని అన్నారు.