చిల్లపల్లికి వినతిపత్రమిచ్చిన బ్రహ్మానందపురం వాసులు

మంగళగిరి, తాడేపల్లి, బ్రహ్మానందపురం వాసులు తమ సమస్యలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి తెలియజేయాలని బుధవారం ఉదయం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావుని కలసి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్కడ అనేక సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నామని ఇక్కడ గతంలో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణ నాటి నుంచి ఇక్కడే తమ పూర్వీకులు కూడా ఉండే వారని నాటి నుంచి ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని ప్రస్తుత మీరైనా తమ భాధలను పరిష్కారం కావాలని మీరైనా మాకు న్యాయం చేయాలని కోరారు. అనేక అంశాలపై స్థానికలు వారి మనోభావాలు తెలియజేశారు. తమకు చేతనైనంత వరకు మీకు న్యాయం చేస్తానని చిల్లపల్లి శ్రీనివాసరావు హామీ ఇవ్వడం జరిగింది.