వాలంటీర్లతో వైసీపీ పార్టీ చీరల పంపిణి – తాతంశెట్టి నాగేంద్ర

ఉమ్మడి కడప జిల్లా, రైల్వేకోడూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల ఫోటోలతో కూడిన సంచులలో సాక్షత్తు వాలంటీర్ల చేతులమీదుగా ఇంటింటికి పంపకాలు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం అని డంకాలు పలుకుతూ ఇలా వాలంటీర్ల ద్వారా చీరల పంపిణి చేయడం వైసీపీ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు ఎంపీ గారు కాని, ఎమ్మెల్యే గారు కాని తాము చేసిన అభివృద్ధి పనులు చేయబోయే పనులు చెప్పి ఓట్లడిగే పరిస్థితులు లేక చీరలు, పంచలు పంచి ఓట్లడగడం సిగ్గు మాలిన చర్య అన్నారు. ఇన్ని సంవత్సరాలు పదవిలో ఉండి కూడా ఏమి చేయకపోగా తీరా ఎన్నికలోచ్చేసరికి శిలాఫలకాలు, ఓపెనింగులు, కోట్ల నిధులు అని అపద్దాలాడుతూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకునే డ్రామాలు ఆడుచున్నారని ఏద్దేవా చేశారు. వాలంటీర్ల చేత చీరలు పంపిణి విషయాన్ని రాష్ట్ర, కేంద్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసామన్నారు. ఆడవాళ్ళ మాన ప్రాణాలు కాల రాసిన ఈ ప్రభుత్వం ఒక చీర పంచి మభ్యపెట్టాలనుకోవడం హేయమైన చర్య ప్రజలు అన్ని గమనించి తగిన బుద్ది చెప్పాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జోన్ 1 కొకన్వీనర్ పగడాల వెంకటేష్, సర్పంచ్ కారుమంచి సంయుక్త, పగడాల చంద్రశేఖర్, దాసరి వీరేంద్ర వరికూటి నాగరాజతదితరులు పాల్గొన్నారు.