నాగబాబు, నాదెండ్లతో కావలి నియోజకవర్గ పొత్తు విషయం చర్చించిన అళహరి సుధాకర్

  • నాగబాబు, నాదెండ్ల మనోహర్ లను కలిసి, కావలి నియోజకవర్గంలో పొత్తు మీద చర్చించిన అళహరి సుధాకర్

మంగళగిరి: జనసేన, మంగళగిరి పార్టీ కార్యాలయంలో సోమవారం నాగబాబుని, తెనాలి పార్టీ కార్యాలయంలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ని కావలి నియోజకవర్గ ఇంఛార్జి అళహరి సుధాకర్ కలిసి వారికి బోకే ఇచ్చి కావలి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు నన్ను కావలి నియోజకవర్గ ఇంచార్జీ గా నియమించి సుమారు 5సంవత్సరాల నుండి పార్టీ నిర్దేశించిన ప్రతీ కార్యక్రమము నా సొంత డబ్బులతో నడపుకుంటూ, రైల్వే రోడ్ లో అయితే నేమి, ఇప్పుడు తుమ్మలపెంట రోడ్డులో అతిపెద్ద పార్టీ కార్యాలయము ఘనంగా ప్రారంభించడం జరిగింది అని, కావలి లో పార్టీ మనుగడను కాపాడుతూ ఏ పార్టీ తో కూడా లోపాయి కారి ఒప్పందం లేకుండా, పోలీసులతో కేసులు పెట్టించికొని ఎంతో ఓర్పుతో పనిచేసుకుంటూ వస్తుంటే.
పొత్తులో భాగంగా జేఎస్పీ, టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపి కి అవకాశము ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి అదేశానుసారం ఒక ఇంచార్జీ గా టీడీపీ-జేఎస్పీ ఆత్మీయ సమావేశములో, తదుపరి రాలీలో పాల్గొని వారికి పూర్తి మద్దతు తెలిపిన విషయం అందరికీ తెలిసిందే, అదే క్రమములో ఒక పద్దతి ప్రకారం కార్యాచరణ చేసుకుంటూ పోదామని మా మండల అధ్యక్షులు, కావలి టౌన్ అధ్యకుడు మరియు వార్డ్ ప్రెసిడెంట్ల వివరాలు టీడీపీకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుండి మండలస్థాయిలో, వార్డ్ ఇంచార్జీలు సమన్వయము చేసుకుంటూ కలిసి ప్రచార కార్యక్రమాలలో పాల్గోఒటున్నరు. ఒక పద్దతి ప్రకారం పోవాల్సిన క్రమములో అనవసరమైన వదంతులు టీడీపీ వారి వ్యవహారశైలి అభ్యఒతరకరంగా మరియు మాలోనే గ్రూపులను ప్రోత్సహించే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారే నన్ను ఇంఛార్జి గా మరియు టీడీపీ-జేఎస్పీ కో-ఆర్డినేటర్ గా నియమించి ఉన్నారు. ఎంతో నిభద్దతతో ఉండే మా నాయకులు, జనసైనికుల, వీర మహిళలను కించ పరిచే విధంగా, నా మనోభావాలను దెబ్బతినే విధంగా వారికి వారే జనసేనలో ఎవరేరితో కలుపుకొని పోవాలో వారే నిర్యించుకోవడానికి మాది జనసేన పార్టీ ఏకానీ.. టీడీపీ లో భాగము కాదు. మా నాయకుడు చెప్పింది ఓటు చీలకూడదు, ఈ రాక్షస పాలన పోవాలి కాబట్టి ఉమ్మడి అభ్యర్ధి తో కలిసి పనిచేయని చెప్పారే కానీ ఎవరి పల్లకీ మోయమని చెప్పలేదు, అదే క్రమములో మా నాయకులకు అవమానము జరిగితే నాకు జరిగినట్లు అని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాను అని అన్నారు. ఈ అంశాలు మొత్తం మా పెద్దలు నాగబాబు గారికి మరియు నాదెండ్ల మనోహర్ గారికి వివరించామని తెలిపారు. నాగబాబు గారు త్వరలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళుతున్నారు అని తెలిపారు.