కలకలం రేపుతున్న మమత ఆడియో..

పశ్చిమబెంగాల్‌లో తొలి విడుత పోలింగ్‌ మొదలైన వేళ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ‘ఆడియో’ వార్‌కు తెరలేచింది. తృణమూల్‌ నుంచి బీజేపీలో చేరిన ప్రళయ్‌రాయ్‌కి సీఎం మమత ఫోన్‌ చేసి.. నందిగ్రామ్‌లో తన విజయం కోసం పనిచేయాలని కోరినట్టు బీజేపీ ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేయడం కలకలం రేపింది. మమత అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆ పార్టీ ఈసీకి ఫిర్యాదుచేసింది. మరోవైపు, బీజేపీకి కౌంటర్‌గా తృణమూల్‌ కూడా ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేసింది. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడంపై బీజేపీ నేత ముకుల్‌రాయ్‌ మరో నాయకుడితో మాట్లాడుతున్నట్టు ఆ ఆడియోలో ఉన్నది.