వరదల వల్ల నష్ట పోయిన రాయలసీమ కు పశ్చిమగోదావరి జిల్లా జనసేన నిత్యావసరాలు పంపిణీ

జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపుమేరకు రాయలసీమ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన నష్టపోయిన కుటుంబాలకు పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవింద రాజు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని నిమిత్తం తణుకు జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ వీడి వాడ రామచంద్ర రావు వరద బాధితుల సహాయార్థం100000( లక్ష రూపాయలు )ఆర్థిక సాయం జిల్లా అధ్యక్షులు వారికి అందజేసినారు . ఈ కార్యక్రమంలో తణుకు టౌన్ అధ్యక్షుడు కొమిరెడ్డి శ్రీను ,తణుకు మండలం అధ్యక్షులు చిక్కాల వేణు , ఇరగవరం మండలం అధ్యక్షులు ఆకేటి కాశీ, అత్తిలి మండలం అధ్యక్షులు దాసం ప్రసాద్, తణుకు టౌన్ ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.