రెడీ ఫర్ రిలీజ్ ‘రెచ్చిపోదాం బ్రదర్’
కిరణ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రెచ్చిపోదాం బ్రదర్’. ఏకే జంపన్న దర్శకత్వంలో వీవీ లక్ష్మి, హనీష్ బాబు ఉయ్యూరు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ- ”అన్ని కమర్షియల్ హంగులున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. సాయి కార్తీక్ స్వరాలను అందించారు. మా సినిమా లిరికల్ సాంగ్ ‘జాగో..’ను ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేయగా 1 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. దీనికి కారణం సాయి కార్తీక్ సంగీతం, భాస్కరభట్ల లిరిక్స్, భాను కొరియోగ్రఫీనే” అన్నారు.