జేఈఈ నిర్వహణపై మమతాబెనర్జీ ఆగ్రహం

కరోనా విపత్కర పరిస్థితులలో జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించవొద్దని వ్యతిరేకించిన రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్ కూడా ఒకటి. బిజేపిఏతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకమై ఈ విషయంలో సుప్రీం కోర్టు లో కూడా పిటిషన్ ధాఖలు చేశాయి. అయినా సరే మేము పరీక్షలు నిర్వహించి తీరుతాం అని చెప్పి కేంద్రం ప్రభుత్వం జీఈఈ పరీక్షలను నిర్వహిoచినది.

విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే అధికారం కేంద్రానికి ఎవరిచ్చారని మమతాబెనర్జీ మండిపడ్డారు. జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలను పశ్చిమబెంగాల్ లోని 75 శాతం మంది విద్యార్థులు రాయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,652 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా. కేవలం 1,167 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. జేఈఈ పరీక్ష నిర్వహణ కోసం తమ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. కరోనా వైరస్‌ వల్ల అభ్యర్థులెవరూ పరీక్ష రాయడానికి ముందుకు రాలేక విద్యార్థులు అవకాశాన్ని కోల్పోయారని అన్నారు.