మత్స్యకారుల కష్టాలు ప్రభుత్వానికి పట్టావా..?: పాలవలస యశస్వి

*జనసేన మత్స్యకార వికాస విభాగం ఆధ్వర్యంలో మత్స్యకారులకు పరామర్శ
*నరసాపురంలో మత్స్యకారుల సమస్యలపై గళం విప్పనున్న జనసేనాని
*పలు సమస్యలను తెలిపిన మత్స్యకారులు
*20 న మత్స్యకారుల అభ్యున్నతి సభకు రావాలని పిలుపు

జనసేన మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గనగల్ల రాజు నేతృత్వంలో శుక్రవారం ఉదయం గంటస్థంభం వద్దనున్న చేపల బజార్, కాటవీధి, అశోక్ నగర్ లో ఉన్న మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జ్ పాలవలస యశస్వి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 20న మత్స్యకార అభ్యున్నతి సభను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నరసాపురం లో నిర్వహిస్తున్నారని, ఆసభకు మద్దతు గా నేడు విజయనగరంలో మత్స్యకారుల కుటుంబాలను కలసి, వారికోసం ప్రభుత్వం పై చేసే పోరాటం కోసం తెలిపి, ఆసభకు కూడా వారిని రమ్మనమని ఆహ్వానించారు. మత్స్యకారులంతా తమ గోడును విన్నవించారని, వీరి వినతులను అధినేతకు తెలుపుతామని, ముఖ్యంగా మత్స్యకార సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపు ఎందుకు పెంచట్లేదని, ఎన్నికల ప్రచారంలో మరణించిన మత్స్యకార కుటుంబాలకు ఇస్తామని చెప్పిన పది లక్షలు ఎందుకు ఇవ్వట్లేదని, మత్స్యకారుల బాధలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు.

జనసేన మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గనగల్ల రాజు మాట్లాడుతూ మత్స్యకారులు అంతా 20వ తేదీన జరగబోయే మత్స్యకార అభ్యున్నతి సభకు తరలిరావాలని కోరుతూ.. మత్స్యకారులకు అండగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తప్ప రాష్ట్రంలో ఏనాయకుడూ మాట్లాడట్లేదని, మత్స్యకారులు అందరికీ న్యాయం చేయడానికి అధినేత పవన్ కళ్యాణ్ తో కలసి పోరాడతామని తెలిపారు.

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, జనసేన మత్స్యకార వికాస విభాగం కార్యవర్గం సభ్యులు గనగల్ల రాజుకు అడుగడుగునా హారతులు ఇచ్చి, పూలమాలలతో మత్స్యకారులంతా జననీరాజనాలు పలికారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఝాన్సీ వీరమహిళ తుమ్మి లక్ష్మి రాజ్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు), లాలిశెట్టి రవితేజ, జనసేన కార్పొరేట్ అభ్యర్థులు లోపింటి కళ్యాణ్, హుస్సేన్ ఖాన్, దాసరి యోగేష్, యర్నాగుల చక్రవర్తి, మిడతాన రవికుమార్, విశ్వ, కిషోర్, సాయి, శ్రీరామ్, కుమార్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.