రోడ్లపై ఉన్న గుంతలను మరమ్మత్తు చేసే కార్యక్రమం కొనసాగించాలి

సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలో ఇడి మేపల్లి, ఈదగాలి, వడ్డి పాలెం, జంగాలపల్లి గురువింద పూడి మీదుగా నేషనల్ హైవే కి వెళ్లేటువంటి రోడ్డు మొత్తం గుంతల మయం అస్తవ్యస్తంగా ఉంటే స్థానిక ఎమ్మెల్యే రెండుసార్లు ప్రజల చేత ఓట్లు వేయించుకొని గెలిచి గతంలో ప్రతి పక్షంలో ఐదు సంవత్సరాలు ఉండి, ఇప్పుడు అధికారపక్షంలో పరిపాలన కొనసాగిస్తూ.. నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారు. గుంతల మయం అయిన ఈ రోడ్డుని ఇప్పటివరకు ఈ గుట్టలను పూడ్చక పోవడానికి కారణం ఎమిటి? అని జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేను ఒకటే అడుగుతున్నాము. దయచేసి ఇకనైనా రోడ్లపై ఉన్న గుంతలను మరమ్మత్తు చేసే కార్యక్రమం కొనసాగించాలని కోరుకొంటూ.. అలా జరగని పక్షంలో ప్లకార్డులు పట్టుకొని నిరసనను చేపడతాం అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, సందీప్, రహమాన్ భాయ్, శ్రీహరి, గిరీష్,తదితరులు పాల్గొన్నారు.