వరంగల్ జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు

*ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జీ ఆకుల సుమన్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించబడిన “అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు”

వరంగల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ని పురస్కరించుకొని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను గ్రేటర్ అధ్యక్షుడు భైరి వంశీ కృష్ణ అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వీరమహిళల చేత కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా మరియు నర్సంపేట నియోజకవర్గ నాయకులు మేరుగు. శివ కోటీ యాదవ్ మాట్లాడుతూ… మహిళా దినోత్సవం అనునది కార్మిక ఉద్యమం నుంచి పుట్టింది అని, మహిళలు నేటి సమాజంలో ఆత్మగౌరవంతో, స్వశక్తితో ఉన్నత శిఖరాలకి చేరుకుంటు రంగం ఏదీ అయిన, కష్టం ఎంతైనా పురుషులకి తామేమీ తీసిపోమనీ స్త్రీ శక్తిని చాటుతున్నారన్నారు. భారత దేశానికి తొలి ప్రధాన మంత్రి “ఇందిరాగాంధీ”, భారత దేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన “రాణి రుద్రమదేవి”, భారత దేశం నుంచి అంతరిక్షంలోకి అడుగు పెట్టిన మొట్ట మొదటి మహిళా “కల్పన చావ్ల” వంటి ఎంతో మంది మహిళలు దేశానికే స్ఫూర్తి దాయకం అన్నారు. అలాగే జన సేన పార్టీ మహిళ అభ్యున్నతికి వారి రాజకీయ, ఆర్థిక, సాంఘిక రంగాల్లో సమాన హోదా అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తుంది అని, మహిళల ప్రగతి.. మన దేశ అభివృద్ధి అన్నారు..ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ఉపాధ్యక్షులు తాళ్లపెల్లి బాలు గౌడ్, కార్యదర్శి, శేషాద్రి సందీప్, యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబెర్ వస్కులా నిఖిల్ చోప్రా, వరంగల్ జిల్లా నాయకులు గోపు నవీన్, మనోజ్, అనిల్, దయాకర్, కుమార్, శివ, అనుదీప్, వీరమహిళలు స్వప్న, అనిత, ఆశజ్యోతి, సుమలత మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.