ఆమదాలవలస జనసేనలో 150 కుటుంబాల చేరిక

ఆమదాలవలస, ఆమదాలవలస మున్సిపాలిటీ, శ్రీకాకుళం నియోజకవర్గం నాల్గవ వార్డు వార్డు కసింవలస గ్రామంలో జనసేన ఆత్మీయ సమావేశం సభ తవిటి నాయుడు, రాజశేఖర్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు, శ్రీకాకుళం నియోజకవర్గం ఇంఛార్జ్ కోరాడు సర్వేశ్వర రావు విచ్చేయగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు నచ్చి సుమారు 150 కుటుంబాలు జనసేన పార్టీ చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సరుబుజ్జిలి మండల జడ్పిటిసి అభ్యర్ధి పైడి మురళీ మోహన్, శ్రీకాకుళం మండల జడ్పిటిసి అభ్యర్థి తాటాకుల కూర్మా రావు, గురు ప్రసాద్ ఉదయ్, సింహాచలం రాంబాబు, వీర మహిళలు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.