కొరియోగ్రాఫర్‌గా హీరోయిన్‌ సాయి పల్లవి

సాయి పల్లవి అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఆమె డ్యాన్స్‌. ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ సుస్థిర స్థానం సంపాదించుకున్న సాయి పల్లవి డ్యాన్స్ లో తనకు తానే పోటీ, తనకు పోటీ వచ్చే హీరోయిన్స్ లేరని నిరూపించుకున్నారు. ఇప్పటికే సాయి పల్లవి ‘రౌడీ బేబి’, ‘పిల్లా రేణుకా’ పాటలకు ఎంత ఆదరణ లభించిందో మనకు తెలిసిన విషయమే. ఈ క్రమంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆమెకు ఓ కొత్త బాధ్యత అప్పగించారట. ఎలాంటి డాన్స్ అయినా అలవోకగా చేయగలిగే సత్తా కలిగిన సాయి పల్లవి ఫై నమ్మకం తోనే ‘లవ్ స్టోరీ’ లో ఓ పాట కొరియోగ్రఫీ బాధ్యతలను ఆమెకు అప్పగించారట శేఖర్ కమ్ముల.