స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నసుంకెట మహేష్

భైంసా పట్టణం, ఏపి నగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. సంబరాలలో బాగంగా విద్యార్థులతో వీధులలో ర్యాలీ నిర్వహించి, మహనీయుల నినాదాలతో హోరెత్తించారు. అనంతరం జాతీయ గీతం ఆలాపించి జెండా కు సెల్యూట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జన సేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు హాజరై మాట్లాడుతు.. స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్లు గడిచిన అభివృద్ది కి ఆమడ దూరంలో వున్నాం ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు కరువు, సరైన వసతులు లేవు, ఊళ్లలో రోడ్లు, మోర్లు, డ్రైనేజీ, లైట్లు, పెన్షన్స్, ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు ఎక్కువ, రేషన్ కార్డులు లేవు, కిరాయి ఇండ్ల లలో వున్న వారికి స్థలాలు లేవు, కరువు వల్ల నష్ట పోయిన రైతులకు పరిహారం లేదు, ఆడపిల్లలు, మహిళ లపై అత్యాచారాలు జరిపిన దోషులు తప్పించుకొని తిరగడం, ప్రభుత్వ, ప్రైవేట్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఉద్యోగులకు జీతాలు లేవు, పెరిగిన ధరలను తట్టుకోలేని సామాన్య మధ్య తరగతి కుటుంబాల ఆవేదన, ఇలా చాలా వున్నాయి..మహనీయుల త్యాగాలకు విలువ లేకుండా పోయింది. విద్యార్థులు బాగా చదువుకొని ప్రశ్నించే గొంతుగా తయారవ్వాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *