‘ఆర్‌ఆర్‌ఆర్‌’: లేడీ విలన్‌ గా ఐరిష్‌ అందాల భామ

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జరుగుతోంది. కోవిడ్ పాండెమిక్ తర్వాత అందరి డేట్స్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని షూటింగ్ ని ఫినిషింగ్ దశగా తీసుకెళ్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌ నటులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఐరిష్‌ అందాల భామ అలిసన్‌ డూడి ప్రతినాయికగా లేడీ స్కాట్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు తాజాగా ఆమె భారత్‌కు విచ్చేశారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. లేడీ స్కాట్‌ ఇండియా వస్తుందంటూ రాసుకొచ్చారు. మరి అలిసన్‌ ఎప్పటి నుంచి షూట్‌లో పాల్గొంటారు? ఆమె పాత్ర ఎలా ఉంటుంది? తదితర విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.