జనసేన ఫ్లెక్సీలను చింపుతున్న వైసీపీ అగంతకులను హెచ్చరించిన బత్తుల

  • అనంతరం నూతన ఫ్లెక్సికి ఏర్పాటు

రాజనగరం నియోజకవర్గం, సీతానగరం మండలం కూనవరం గ్రామంలో జనసైనికులు ఏర్పాటుచేసిన జనసేన ఫ్లెక్సీలను అదేపనిగా కొంతమంది అధికార పార్టీ చెందిన వ్యక్తులు చింపేయడంతో కూనవరం గ్రామ జనసైనికులు తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తున్నారు. గతంలో కూడా ఇలాగే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపి వారి పైసాచికత్వాన్ని చూపించుకున్నారు అని ఇకపై ఉపేక్షించేది లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ జరిగిన సంఘటనను జనసైనికులు రాజనగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ దృష్టికి తీసుకువచ్చారు. విషయం తెలిసిన వెంటనే బలరాం కూనవరం గ్రామంలో సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ పరిస్థితిని చూసి జనసైనికులతో చర్చించారు. ముఖాముఖిగా ఎదుర్కోలేని, తలపడలేని ప్రత్యర్థులు చేసే ఇలాంటి తక్కువ స్థాయి మనస్తత్వ పనులను ఇకపై ఉపేక్షించేది లేదని మరొకసారి ఇటువంటి చేతగాని పనులు చేసిన ఎడల జనసైనికులు అంటే ఏంటో చూపిస్తామని మౌనాన్ని చేతాకానితనంగా భావిస్తే మీరు పెద్ద తప్పు చేస్తున్నట్లే అని తెలియజేశారు. రోజు రోజుకు ప్రజాదారణ పొందుతున్న జనసేన పార్టీని చూసి ఓర్వలేక కడుపుమంటతో ఇలాంటి పనులు చేస్తున్న అధికార పార్టీ వ్యక్తుల సమూహానికి తొందర్లోనే బుద్ధి చెప్తామని మరొకసారి ఇటువంటి అవాంఛనీయ సంఘటనకు దారి తీస్తే పోలీసు అధికారులకు కంప్లైంట్ ఇస్తానని హెచ్చరించారు. నీతి నియమాలు పాటించడం జనసైనికుల కర్తవ్యం కాబట్టి మేము సహనాన్ని పాటి‌స్తున్నాం. మా సహనాన్ని పరీక్షించడం మీ పురోగతికే ముప్పు అని ఫ్లేక్సీలనైతే చింపగలరు కాని మా గుండెల నిండా నిండిన మా అభిమానాన్ని తాకలేరు అని ఘంటాపథంగా చెప్పుకొచ్చారు. అనంతరం కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావుతో బత్తుల బలరామకృష్ణ చర్చించి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కూనవరం జనసైనికులతో బత్తుల మాట్లాడుతూ వారికి ధైర్యాన్ని ఇచ్చి ఇంకొక ఫ్లెక్స్ ఏర్పాటుకు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల జనసేన శ్రేణులు మట్ట వెంకటేశ్వరరావు, ప్రశాంత్ కిషోర్, మాధవరపు వీరభద్రరావు, వల్లభ శెట్టి వెంకటరమణ (డబ్బు), మాధవరపు కోటేశ్వరరావు, అడ్డాల శ్రీను, బోయిడి వెంకట్, పెద్దపాటి ధర్మ సత్యసాయి, స్వామి కాపు, మాధవరపు నాని, కొనాలి అనిల్, చలమశెట్టి సతీష్, రుద్రం గణేష్, రావూరి దుర్గాప్రసాద్, రుద్రం తేజ తదితరులు పాల్గొన్నారు.