జాతిపితకు నివాళులర్పించిన శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్

పిఠాపురం, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్ పిఠాపురం టౌన్ లో గల ఉప్పాడ జంక్షన్ నందు మన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం డాక్టర్ శ్రీధర్ పిల్లా మీడియాతో మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతి మార్గాల్లో మాత్రమే ఏదైనా సాధించుకోగలమని చాటి చెప్పిన మహనీయుడు మన జాతిపిత మహాత్మాగాంధీ, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీని సత్యం, అహింస, శాంతి మార్గాల్లోనే ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. గ్రామ స్వరాజ్యం రావాలంటే పవన్ కళ్యాణ్ రావాలని మీడియా సమావేశంలో డాక్టర్ శ్రీధర్ పిల్లా చెప్పడం జరిగింది దీనిలో భాగంగా జిల్లా అధికార ప్రతినిధి తోలేటి శిరీష, పిల్లా రమ్య జ్యోతి, బాలిపల్లి అనిల్, వాకపల్లి సూర్య ప్రకాష్, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.