త్రాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసిన రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల పరిధిలో మడితాడు గ్రామపంచాయతీలో గుట్టకింద రాచపల్లిలో ఉండే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం జనసెన నాయకులు రామ శ్రీనివాస్ సందర్శించడం జరిగింది. విద్యార్థినీ, విద్యార్థులు మొత్తం 430 సంఖ్యలో ఉండగా ఆ స్కూలులో మధ్యాహ్నం భోజనానికి సంబంధించిన వంటలను పరిశీలించి పిల్లలతో కలిసి భోజనం చేసి అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకోగా త్రాగు నీరు సమస్య తీవ్రంగా ఉందని తెలపడంతో ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రభుత్వం, పాలకులు, వెంటనే యుద్ధ ప్రాతిపధికన త్రాగు నీరు కొరతను పరిగణలోకి తీసుకుని తక్షణ నిధులు మంజూరు చేసి త్రాగు నీరు సౌకర్యం ఏర్పాటు చేయాలని, అలానే స్కూల్ కు వెనుక వైపు పురాతనమైన ప్రహరీ గోడ అధ్వానంగా ఉండడం గుర్తించి భద్రత కల్పించాలని, సంబంధిత శాఖ అధికారులు స్కూల్ లో ఉండే సమస్యల మీద దృష్టి పెట్టాలని ప్రభుత్వం, పాలకులు, అధికారులు ద్వారా విచారణ జరిపి వెంటనే అక్కడి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని జనసేనపార్టీ తరపున రామ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ సుమలత, ఉపాద్యాయులు, విద్యార్థులు, బీసీ లీడర్ గంతల చెన్నకృష్ణ తదితరులు పాల్గొన్నారు.