ఒక్కొక్క జనసైనికుడు ఒక్కొక్క అణుబాంబులా తయారవుతారు

పార్వతిపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, ఇప్పటం గ్రామంలో జరుగుతున్న దారుణాలు చర్చించడానికి కడకెల్లా గ్రామ జనసైనికులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జనసైనికులు సిరిపోతు ప్రసాద్ బుజ్జి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక గ్రామస్తులు పరీమర్శించడానికి వస్తే ఆయనే అడ్డుకోవడమే కాకుండా ఆయనని అడ్డుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. అయినా ఆయన వెనకడుగు వేయలేదని పవన్ కళ్యాణ్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని జనసేన పార్టీ నాయకులను గాని జనసైనికులను గాని అనవసరంగా కేసులు పెట్టి లేకపోతే భయపెట్టి ఈ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలన్నీ సరైన పద్ధతి కాదని ఆయన చెప్పారు. ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది సరైన పద్ధతి కాదని గ్రామస్తులకు ముందుగా నోటీసులేమీ ఇవ్వకుండా వాళ్లు ఇళ్ళు కూల్చడం సరైనది కాదని దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 60 ఫీట్ రోడ్లు ఉన్న గ్రామానికి 120 ఫీట్ రోడ్లు ఎందుకని ప్రశ్నించారు? రోడ్లో విస్తరణ చేయడానికి ఇది ఏమైనా సిటీ కాదు పల్లెటూరు అలాంటి పల్లెటూరుకి మీరు 120 ఫీట్ రోడ్లు వేయడం సరైన పద్ధతి కాదని మీకు పాలన చేతకాకపోతే వెంటనే దిగిపోమని మాట్లాడారు. అంతేగాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక బీహార్ లా తయారు చేయకండి అని అన్నారు. దారపురెడ్డి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలు వాళ్ళు చెప్పుతో వాళ్ళు కొట్టుకోవాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అన్యాయంగా గ్రామస్తుల ఇళ్ళను కూల్చడం ఎందుకు ఆ హక్కు మీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు? రేపు ఎలక్షన్ టైం లో ఆ గ్రామానికి వెళ్లి మీరు ఓట్లు ఎలా అడుగుతారని చుట్టూ ఉన్న గాంధీ విగ్రహాన్ని. నెహ్రూ విగ్రహాన్ని మరియు గుడిలోన నందిని పగలగొట్టారు. వైయస్సార్ విగ్రహాన్ని పగలగొట్టలేదు వీళ్ళ కన్నా ఆయన దేనిలో ఉత్తముడు అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటం గ్రామస్తులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన కోరారు. సంబంగి హరికృష్ణ మాట్లాడుతూ గత మూడు రోజులగా పవన్ కళ్యాణ్ మీద రెక్కీ చేస్తున్న వాళ్లకి ఒకటే చెప్పాలనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ కి ఏదైనా జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని, ఎవరు చేయిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అవన్నీ బాగా తెలుసు అని ఆయన చెప్పుకొచ్చారు. ఆయనకు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, జడ్ ప్లస్ సెక్యూరిటీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరిని అడిగామని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వనిచో మేము ఆయన వెనక కాపు కాస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ ని టచ్ చేయాలంటే ముందుగా జనసైనికులని దాటుకొని వెళ్లాలని ఒక్కొక్క జనసైనికుడు ఒక్కొక్క అణు బాంబులా తయారవుతారని, దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.