జనంలోకి జనసేన.. కొత్త నవరసపురంలో బొమ్మిడి నాయకర్ పాదయాత్ర

  • జనంలోకి జనసేన 5వ

నవరసపురం: జనంలోకి జనసేన 5వ రోజు కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గం కొత్త నవరసపురం గ్రామంలో పాదయాత్రగా ప్రతీ గడపకు వెళ్లి వారికి జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేసి వారు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు తెలుసుకుని వారికి జనసేన పార్టీ తరపున నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మడి నాయకర్ భరోసా ఇచ్చారు. ఆ గ్రామంలో ముఖ్యంగా త్రాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, అలాగే అది లోతట్టు ప్రాంతం అవ్వడం వల్ల వరదలు వచ్చినప్పుడు గ్రామం మొత్తం మునిగిపోయి ఇబ్బందులు పడుతున్నారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు మరియు రోడ్ల దుస్థితి చాలా అద్ధ్వాన్నంగా ఉంది. పాత నవరసపురం కొత్త నవరసపురం గ్రామాలలో ఒకే రకమైన సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని నాయకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, బందెల రవీంద్ర, గుబ్బల మార్రజు, గుగ్గిలపు శివరామకృష్ణ, పోలిశెట్టి నళిని, కొట్టు రామాంజనేయులు, బందెల ఎలీషా, అందే దొరబాబు, ఒడుగు ఏసు, గంటా కృష్ణ, కోపల్లి శ్రీను బొక్కా స్వామి, మేడిది ప్రవీణ్ కుమార్, ఈదా హేమంత్, కిందాడి హర్ష మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు మరియు కొత్త నవరసపురం ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.