గవర సోమశేఖర రావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం

గాజువాక: జనసైనికులకు అండగా, పార్టీని బలోపేతం చేసే దిశగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన మూడవ విడత క్రియాశీలసభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం జీవీఎంసీ 85వ వార్డులో చేరిన అండమాన్ కొండయ్యవలస బంగారమ్మ గుడి వద్ద గాజువాక నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు జీవీఎంసీ 85 వ వార్డు ఇంచార్జ్ గవర సోమశేఖర రావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. అనంతరం మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రవేశ పెట్టిన జనసేన సభ్యత్వ నమోదు ప్రతి ఒక్క జన సైనికుడు రెన్యువల్ అలాగే నూతన సభ్యత్వం చేయించుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సీనియర్ నాయకులు పి. వసంత, రాజు, చంటి, నాగ భాస్కర్, కృష్ణ, శ్రీను, సాయి, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.