అనాధ వృద్ధులకు మహా అన్నదాన కార్యక్రమం

జనగామ పట్టణ కురుమ సంఘం ఆధ్వర్యంలో రాజ రాజేశ్వరి వృద్ధాశ్రమంలో పప్పు పెరుగు అన్ని రకాల కూరగాయలతో సంపూర్ణ భోజనాన్ని అనాధ వృద్ధులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మానవతా దృక్పథంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కురుమ సంఘం జనగాం పట్టణ అధ్యక్షులు బాల్దే మల్లేశం కురుమ, జూకంటి శ్రీశైలం, కేమిడీ ఉపేందర్ కి పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జోగు భాస్కర్, చేవెళ్లి వీరస్వామి, రంజిత్, నరేంద్ర పవన్, సాయిరాం, కడకంచి వీరస్వామి, మను, మంగ శ్రీశైలం, జట్ట యాదగిరి, కర్రి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.