బృందావనం కాలనీ, ఇందిరమ్మ కాలనీలలో జనంకోసం జనసేన

మదనపల్లె, జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా బుధవారం కోళ్ల బైలు గ్రామం బృందావనం కాలనీ & ఇందిరమ్మ కాలనీలలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర అధ్యక్షతన ముఖ్య నాయకులు రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి కాలనీలను సందర్శించారు. అలాగే అక్కడ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారు పడుతున్న బాధలు చేబుతుంటే ఒక్కొక్కరి బాధలు వర్ణనాతీతం అన్నారు. అలాగే 2007 సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. ప్రజలందరూ వాటి నిర్మాణం పూర్తి చేసి అక్కడ నివసిస్తున్నారు. గత 15 సంవత్సరాల నుండి ఇప్పటివరకు కనీస మౌళిక వసతులు రోడ్లు, డ్రైనేజీ, కాలువలు, మరీ ముఖ్యంగా త్రాగునీరు, వీధిలైట్లు, ఏ ఇంటికి ఏ వీధికి కానీ లేవు అన్నారు. వారి సమస్యలన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అలానే స్థానిక బృందావనం కాలనీలో ఉండే జనసేన నాయకులు, రాజారెడ్డి, రెడ్డి శేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లి సీనియర్ నాయకుడు తోట కళ్యాణ్, ఐటీ విభాగం జగదీష్, పట్టణ ప్రధాన కార్యదర్శి నాగరాజు, రామసముద్రం ఉపాధ్యక్షులు లక్ష్మీపతి, కుమార్, జనార్ధన్, అర్జున, నాగరాజు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.