‘ రెడ్ ‘ నివేథా పేతురాజ్ జాతకం మారుస్తుందా..?

‘మెంటల్ మది’లో చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన బ్యూటీ నివేథా పేతురాజ్ . ఆ సినిమాలో శ్రీ విష్ణు సరసన భాగానే రోమన్స్ చేసి ఆకట్టుకున్నప్పటికీ ఈ అమ్మడుకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ సినిమాల్లో బిజీ అయ్యింది. తమిళ డబ్బింగ్ సినిమా టిక్..టిక్..టిక్..లో నివేతా నటించిన, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. అయితే ఆ మధ్య వచ్చిన సాయి ధరమ్ తేజ్ ‘చిత్ర లహరి’లో మరో తెలుగు సినిమా ‘బ్రోచేవారేవరురా..’ లో కూడా అదరగొట్టింది. ఇక అల్లు అర్జున్ అల వైకుంఠపురములో లో నటించి మరో హిట్‌‌ను అందుకొని రెడ్ ఛాన్స్ కొట్టేసింది.

రామ్ నటించిన ‘రెడ్’ సినిమాలో మెయిన్ లీడ్ గా అది కూడా పోలీస్ ఆఫీసర్ గా నటించే అవకాశం దక్కించుకుంది. ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. నటిగా మంచి పేరు అయితే తెచ్చి పెడుతున్నాయి కాని స్టార్ డం విషయంలో మాత్రం ఈమె ఇంకా వెనుకబడే ఉన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రెడ్ సినిమా నివేథా పేతురాజ్ కు మంచి మార్కులు తెచ్చి పెడుతుందని అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రెడ్ సినిమా సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విజయం అమ్మడి జాతకాన్ని పూర్తిగా మారుస్తుందని అంటున్నారు. రెడ్ ఏమని ఏంచేస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *