పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 45వ రోజు పాదయాత్ర

• ప్రజల మద్దతుతో, ప్రజల ఆశీసులతో కొనసాగిన పాదయాత్ర
• డప్పుల మోతలతో, వృద్ధుల ఆటలతో, చిన్నారుల కేరింతలతో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర

నాగర్ కర్నూల్, వంగ లక్ష్మణ్ గౌడ్ 45వ రోజు పాదయాత్ర తాడుర్ మండలం, యత్మాతపూర్ గ్రామంలో, వంగ లక్ష్మణ్ గౌడ్ నియోజకవర్గ నాయకులతో కలిసి గ్రామంలో పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ 45 రోజుల నుంచి నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా పాదయాత్ర చేస్తున్నాము. 45వ రోజుకు చేరుకున్న పాదయాత్రకు అనూహ్య స్పందన లభించింది. ప్రజలు మాకు పలికిన ఈ ఘనస్వాగతం ఎన్నటికీ మరువలేనిది ప్రతి గ్రామంలో సమస్యలు ఉన్నాయి. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో జనసేన పార్టీని మూడో ప్రత్నాయంగ చూస్తున్న ప్రజలకు పాదాభివందనాలు. ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమీ నెరవేర్చకుండా వారి రాజకీయ లబ్ధి కోసం ప్రజలకు అపద్ధపు మాటలతో పబ్బం గడుపుతున్నారు. 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బహుజన ముద్దు బిడ్డ, మాజీ శాసన సభ్యులు వి.ఎన్ గౌడ్, వంగ మోహన్ గౌడ్ ల వారసత్వంతో ముందుకు సాగుతున్న నాకు వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు సూర్య, భాస్కర్, ఆరీఫ్, మహేష్, ఎడ్ల రాకేష్, పూస శివ, సందీప్, బాలకృష్ణ, శివ కుమార్, జీవన్ కుమార్, తరుణ్, పర్షరములు, ఆనంద్, మల్లేష్, శివ తదితరులు పాల్గొన్నారు.