రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాటం ఆగదు: రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు: ఏలూరు జిల్లా ఏలూరుమండలం, చొడిమెళ్ళ గ్రామంలో రైతులను ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు జనసైనికులతో కలిసి అకాల వర్షాలు కారణంగా నష్టపోయిన పంటను బుధవారం పరిశీలించారు. జరిగిన నష్టాన్ని, ప్రభుత్వా విధానాలు వలన వారు ఎదుర్కొంటున్నా ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెడీ అప్పలనాయుడు మాట్లాడుతూ గతంలో రైతుకు పండించుకున్న పంటకు అమ్ముకొనే స్వేచ్ఛ ఉండేదని, ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతు అ స్వేచ్ఛను కోల్పోయి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరతో ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. ప్రభుత్వం మద్దతు ధర 1530 రూపాయిలు ప్రకటించాం అని చెప్పడం తప్ప, రైతు చేతికి 1300 రూపాయలు అందడం గగనంగా ఉంది అని వాపోయారు. దానికి తోడు ప్రభుత్వం ఎకరానికి 45 బస్తాలే కొంటాం అని నిబంధనలు పెట్టడంతో, మిగులు పంట ఏమి చేయాలో తెలియని గందరగోళ పరిస్థితిలో ఈ రోజు రైతు ఉన్నారని అన్నారు. గడిచిన 5రోజులు నుండి రైతులు వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయకపోవడం, అకాల వర్షాలుతో కేవలం ఏలూరు నియోజకవర్గంలో చొడిమెళ్ళ గ్రామంలోనే సుమారు 100కు పైగా లారీల ధాన్యం వర్షానికి తడిచిపోయిందాని,ఈ నష్టపోయిన పంటకు ప్రభుత్వామే బాధ్యత వహించాలన్నారు. రైతుకు నష్టపరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో జనసేన పార్టీ తరుపున ఉద్యమిస్తాం అని రెడ్డి అప్పలనాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు బండి రామకృష్ణ భూషణం, రమేష్, నరసింహులు, ఎడ్లపల్లి కోటేశ్వరరావు, జనసేన ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, ఎటించి ధర్మేంద్ర, బొత్స మధు, నాయకులు వీరంకి పండు, రెడ్డి గౌరీ శంకర్, నిమ్మల శ్రీనివాసరావు, బోండా రాము నాయుడు 1 టౌన్ మహిళ ప్రెసిడెంట్ కోలా సుజాత, 2 టౌన్ మహిళ సెక్రటరీ తుమ్మపాల ఉమాదుర్గ, జన సైనికులు కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.