బిగ్ బాస్ కంటెస్టెంట్లతో నాగబాబు సందడి

బిగ్ బాస్ సీజన్ 4.. ఎంతో ఘనంగా  మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున చేతులు మీదుగా పూర్తయింది. బుల్లితెరపై ఎంతో అద్భుతంగా నాలుగు నెలలు బిగ్ బాస్ సీజన్ 4 అధిక టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే బుల్లితెర స్టార్ హీరో, మెగా బ్రదర్ నాగబాబు బిగ్ బాస్ సీజన్ 4 కంటస్టెంట్స్ అందరికి అద్భుతమైన పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

బుల్లితెరపై జబర్దస్త్ తో అదరగొట్టిన  నాగబాబు జబర్దస్ నుంచి బయటకు వచ్చి, దాని నుంచి బయటకు వచ్చిన కొందరితో జీ తెలుగులో బొమ్మ అదిరింది అంటూ ప్రస్తుతం ఓ షో తో అలరిస్తున్నారు. ఈ షో తో పాటు అయన సోషల్ మీడియాలో సైతం ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ రాజకీయాల్లో సైతం అగ్గి రాజేశారు. అలాంటి ఈ మెగా హీరో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4 కంటస్టెంట్స్ కు గ్రాండ్ పార్టీ ఇచ్చారు.ఈ పార్టీ వీడియోను నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్‌ లో అప్‌లోడ్ చేశారు.

ఈ పార్టీ కి అఖిల్‌, సోహెల్‌, మెహ‌బూబ్, అరియానా, లాస్య, హారిక‌, నోయ‌ల్‌, సుజాత‌, అవినాష్ రాగా.అదిరింది కమెడియన్స్, యాంకర్ రవి సైతం ఈ పార్టీకి హాజరయ్యారు. ఈ వేడుకలో యాంకర్ సుజాత పుట్టినరోజు వేడుకను నాగబాబు జరిపించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. బిగ్ బాస్ సీజన్ 4 లో ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడ్డారని 106 రోజుల పాటు ఒక ఇంట్లో టీవీ, మొబైల్, పుస్తకాలు లేకుండా ఉండడం చాలా కష్టమని అయన అన్నారు. ఈ ఇమేజ్ ను వాడుకొని స్టార్స్ అవ్వాలని అయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *