పూతలపట్టు నియోజకవర్గ జనసేన కార్యవర్గ సమావేశం

పూతలపట్టు నియోజకవర్గం, తవనంపల్లి మండల జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన జనసేన కార్యవర్గ సమావేశంలో పలు అంశాల మీద చర్చించడం జరిగింది. సమావేశంలో ముఖ్యంగా రాబోవు రోజుల్లో మన పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే అంశం మీద చర్చించి ఆ తరువాత మండలంలోని నాలుగు పంచాయతీలలో జెండా ఆవిష్కరణ చేసేలాగా నిర్ణయం తీసుకున్నారు. ప్రతివారం రెండు పంచాయతీలలో తిరిగి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకు వెళ్లే లాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య మండల అధ్యక్షులు రాజశేఖర్ @ శివ, మండల ఉపాధ్యక్షులు పూర్ణచంద్ర, బంగారుపాళ్యం, మండల ఉపాధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, మండల ప్రధాన కార్యదర్శులు ఉదయ్ కుమార్ అనిల్, అజిత్, శశాంక్, నాగేంద్ర, పృద్వి, కార్యదర్శులు కొండేపల్లి మనీ, సత్య, జగన్నాథం, లోహిత్ . సీనియర్ నాయకులు చిన్న, నాలుగు పంచాయతీల జనసైనికులు మరియు సోషల్ మీడియా యాక్టివిస్ట్ విశ్వతేజ మరియు జనసైనికులు పాల్గొన్నారు.