విద్యార్థి సంఘాల పోరాటాల ఫలితంగా విజయం సాధించినందుకు అభినందన సభ

ఉమ్మడి చిత్తూరు జిల్లా, మదనపల్లి నియోజకవర్గం, మదనపల్లి పట్టణంలో ఎంతో చరిత్ర కలిగిన చారిత్రాత్మకమైన కళాశాల ప్రైవేటుపరం కాకుండా అన్ని విద్యార్థి సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కలిసి విద్యార్థి సంఘాల పోరాటాల ఫలితంగా గత 280 రోజులుగా ప్రభుత్వంపై పోరాటం చేసి విజయం సాధించడం జరిగింది. నేడు అందులో భాగంగా ప్రభుత్వం కాలేజీని తన పరిధిలోకి తీసుకుంటూ ఇకమీదట ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుందని జీవో రిలీజ్ చేయడం మదనపల్లి ప్రాంత ప్రజలకు చాలా సంతోషదాయకమని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అభినందన సభలో జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపినందుకు విద్యార్థి సంఘాల తరఫున జనసేన పార్టీకి విద్యార్థి సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు. పట్టు వదలకుండా 280 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేసి సాధించుకున్నందుకు విద్యార్థి సంఘాలను విద్యార్థి సంఘాల నాయకులను ఈ సందర్భంగా జనసేన నాయకురాలు శ్రీమతి దారం అనిత అభినందించడమైనది.