ఏయూ వీసీగా దళిత మహిళా ప్రొఫెసర్ ను నియమించాలి

విశాఖపట్నం: ఏయూ వీసీగా దళిత మహిళా ప్రొఫెసర్ ను నియమించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆఫీస్ మెయిన్ గేటు వద్ద జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్హించడం జరిగింది. ఈ సందర్భంగా బోడపాటి మాట్లాడుతూ వందేళ్ల ఆంధ్రా యూనివర్సిటీకి దళిత మహిళను వైస్ చాన్సలర్ గా నియమించాలి. ప్రభుత్వం సామాజిక సాధికారతను చాటుకోవాలి. మాజీ వీసీ ప్రసాద రెడ్డి అవినీతిపై సిటింగ్ జడ్జితో విచారణ జరపాలని
జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో విశాఖ తూర్పు నాయకులు బోగిల శ్రీనివాస్ పట్నాయక్, నాని, సాయికుమార్, ఎర్రయ్య, రాహుల్, లలిత, లక్ష్మి, విక్రమ్, మహేష్, గురుమూర్తి, ఎర్రజి, వీరబాబు, దాస్, రవి, కృష్ణ, యజ్జల నాగరాజు, సుంకర సాయి తదితరులు పాల్గొన్నారు.