రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో వెదురు కుప్పం, ఎస్.ఆర్.పురం మండలాల్లో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేతకాని ప్రభుత్వం, చేతకాని వ్యవస్థ నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థలో ఉప ముఖ్యమంత్రి అసమర్ధుడని, ఇందులో సమర్ధుడని ముఖ్యమంత్రి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అందులోనూ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో చివరికి రోడ్డు కూడా వేయలేని దయనీయ పరిస్థితి నెలకొని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ దుస్థితని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమాన్ని వెదురుకుప్ప మండలంలో జిటి కండ్రిగ, వెదురుకుప్పం పోలీస్ స్టేషన్ ముందు, మొరవ మెయిన్ రోడ్డు, దేవర గుడిపల్లి జగనన్న కాలనీ మెయిన్ రోడ్, దేవళంపేట మెయిన్ రోడ్డు. ఎస్ఆర్ పురం మండలంలో డీకే మర్రిపల్లి, కటిక పల్లి, పిల్లి గుండ్లపల్లి, పిల్లి గుండ్లపల్లి గ్రానైట్ ఫ్యాక్టరీ రోడ్డు, మంగుంట మెయిన్ రోడ్డు, పుల్లూరు రోడ్ల వద్ద నిరసన నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం మండల అధ్యక్షులు పురుషోత్తం, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, మండల యువజన అధ్యక్షులు సతీష్, మండల కార్యదర్శి బెనర్జీ, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కార్వేటినగరం టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, ఉపాధ్యక్షులు సూర్య నరసింహులు, ఎస్ఆర్ పురం మండల ఉపాధ్యక్షులు చార్లెస్, మండల ప్రధాన కార్యదర్శి అవినాష్, వెదురుకుప్పం మండల టిడిపి అధ్యక్షులు లోకనాథ్ రెడ్డి,టిడిపి మాజీ మండల అధ్యక్షులు క్లస్టర్ ఇంచార్జి మోహన్ మురళి, రాష్ట్ర సంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి ముని చంద్రారెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి చంగల్రాయి రెడ్డి, పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ ప్రధాన కార్యదర్శి రజినీకాంత్, పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు చంద్రబాబురెడ్డి, పార్లమెంటు వాణిజ్య విభాగా కార్యదర్శి రమణారెడ్డి, నియోజకవర్గ టిఎన్టిసి ఉపాధ్యక్షులు గంగయ్య, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్, యూనిటీ ఇన్చార్జ్ శ్రీరాములు రెడ్డి, మాజీ సర్పంచులు, మొగిలయ్య రాజేంద్రన్, గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటాద్రి నాయుడు, మునికృష్ణారెడ్డి, చంగలపండురెడ్డి, దామోదర్ రెడ్డి బూత్ కమిటీ కన్వీనర్లు రాజశేఖరవర్మ, బుజ్జిబాబు, కుమార్, మురళీమోహన్, వెంకటరెడ్డి ముఖ్య నాయకులు నాగరాజు రెడ్డి రమేష్ నాయుడు బాలన్న చిన్నమిరెడ్డి జనసైనికులు పాల్గొన్నారు.