పుట్ట వద్ద పనులు చేయించిన జనసేన కౌన్సిలర్

కోనసీమ జిల్లా, అమలాపురం పురపాలక సంఘ 9వ వార్డ్ జనసేన కౌన్సిలర్ గొలకొటి విజయలక్ష్మి వార్డ్ లో పలు కార్యక్రమాలు చేపట్టారు. నాగుల చవితి సందర్బంగా 9వ వార్డు పరిధి నల్లా గార్డెన్స్ రామకృష్ణ నగర్ జానకి పేట మధ్యలో పుట్ట ఉంది. శనివారం నాగుల చవితి సందర్బంగా భక్తులు పుట్టను దర్శించి పుట్టలో పాముకు పాలుపోయడం, గుడ్లు, తేగలు, బుర్ర గుంజు, చలివిడి, నువ్వుల పప్పులతో చేసే ప్రసాదంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తుల రాక కోసం ఏర్పాట్లు చేసారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గొలకోటి విజయలక్ష్మి, గొలకోటి వాసు పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.