రోడ్లు వేయడంలో వైసీపీ విఫలం!!

  • పత్తికొండ నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది నిరసన కార్యక్రమం

పత్తికొండ: జనసేన పార్టీ ఆదేశాల మేరకు టిడిపి, జనసేన సంయుక్తంగా నిర్వహించిన “గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది” అనే కార్యక్రమాన్ని ఆదివారం జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సిజి రాజశేఖర్, టిడిపి జిల్లా కార్యవర్గ సభ్యులు ధనంజయ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు సిజి రాజశేఖర్, మరియు టిడిపి జిల్లా కార్యవర్గ సభ్యులు ధనంజయ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు రోడ్లు వేయడంలో పూర్తిగా విఫలమయిందని బురుజుల నుండి మద్దికేర వరకు ఎటు చూసిన రోడ్డు ఆధ్వన్నంగా ఉంది, గత ఐదు నెలల క్రితం రోడ్డు ప్యాక్చర్ లు వేసామని చెప్పి లక్షలు దండుకున్నారు మీడియాలో మాత్రం అభివృద్ధి చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని. రోడ్ల పరిస్థితి ప్రజలకు తెలియచేయడానికి జనసేన, టీడీపి కలిసి ఈరోజు గురుజల మద్దికేర మధ్యలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వానికి బస్సు చార్జీలపై పెంచే ఉన్న శ్రద్ధ రోడ్లు వేయడానికి ఎందుకు లేదని అడుగుతున్నాం, ఈ జగన్ రెడ్డికి ప్రజలపై ఏ మాత్రం చిత్తశుద్ధి అనేది ఉంటే వెంటనే రోడ్డు శాంక్షన్ చేసి నిరూపించుకోవాలి లేదంటే మరో 10 రోజుల తర్వాత జనసేన టిడిపి ఆధ్వర్యంలో ఇదే రోడ్డుపై రాష్ట్ర రోకలు పూర్తిగా నిలబవేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు టిడిపి పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.