పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ కు అరుదైన గౌరవం

న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ కు అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉంది. అమెరికా స్టాక్ మార్కెట్ నాస్డాక్ భవంతి ఇక్కడే ఉంది. అయితే ఈ భవంతి వద్ద ఏర్పాటు చేసిన బిల్ బోర్డుపై టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఫొటోలు ప్రదర్శించడం విశేషం అని చెప్పాలి. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో టైమ్స్ స్క్వేర్ వద్ద స్లైడ్ షో వేశారని ఉపాసన వెల్లడించారు. ఇదొక మధురమైన అనుభూతి అని ఆమె పేర్కొన్నారు. టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై చరణ్ ఫొటోలు చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తోందని, ఇంతటి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. కాగా, టైమ్స్ స్క్వేర్ పై ఈ అరుదైన గౌరవాన్ని పొందిన తొలి సౌతిండియా నటుడు రామ్ చరణ్ కావడం విశేషం.