నరసాపురం నియోజకవర్గ జనసేన కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం
హైదరాబాద్ లో నివసిస్తున్న నరసాపురం నియోజకవర్గ జనసేన కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశంలో నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ నరసాపురం నియోజకవర్గ ప్రజలు ఎక్కడ ఉన్నా వారికి నేను తోడుగా ఉన్నాను అని తెలియజేయడం కోసం ఈ సమావేశం నిర్వహించాము అని అన్నారు. అలాగే ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరినీ కలిసి వారి సమస్యలు తెలుసుకుని వారి సూచనలు తీసుకోవడం జరిగింది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కనకరాజు సూరి, జక్కం బాబ్జి, కోటిపల్లి వెంకటేశ్వరరావు, ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, తోట నాని, అందే ఫణి, చెనమళ్ళ చంద్రశేఖర్, కొక్కిరిగడ్డ మహేంద్ర చక్రవర్తి, వనమాలి శ్రీను, పెమ్మాడి కిరణ్ పాల్గొన్నారు.