అరకు వ్యాలీలో జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం

అల్లూరీ సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీలో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. గంగులయ్య నియోజకవర్గ పలువురు ముఖ్యనేతలకు భవిష్యత్ ఎన్నికలలో జనసేన పార్టీ ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ప్రజలను జనసేనపార్టీ తో ఏ విధంగా భాగస్వామ్యం చేయాలి. నియోజకవర్గ, మండల స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఉన్న జనసైనికులకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వాలనే అంశాలపై దిశానిర్దేశం చేశారు. అలాగే రాష్ట్రంలో శరవేగంగా మారిపోతున్న రాజకీయసమికరణలు ప్రతి ఒక్క నాయకుడు వీరమహిళలు, జనసైనికులు క్షున్నంగా అధ్యయనం చేస్తూ.. మార్పు కోరే రాజకీయాలపై ఆదివాసీ ప్రజలకు చైతన్యం కలిగించాలని తెలిపారు. దశాబ్దాలకాలంగా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు బలి కాబడ్డ ఆధివాసీల్లో ఇప్పుడు చైతన్యం వస్తుందని క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతూ.. ప్రజల మన్ననలు పొందాలని, ప్రత్యర్థులేవరైనా కూడా మన విషయపరిజ్ఞానంతో ఎదుర్కోవాలని, రెండు ప్రధాన పార్టీల లోగుట్టు, మోసాలు చిట్టా మొత్తం ప్రజలకు తెలియజేస్తూ చైతన్యం కలిగించేవిదంగా కార్యాచరణతో ముందుకు సాగాలని, మార్పు కోరే రాజకీయవసరం ఆధివాసి ప్రజలకు అత్యంతవసరమని తెలియజేయాల్సిన బాధ్యత మనందరిదని తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశంలో అరకు నియోజకవర్గం వివిధ మండలాల నుంచి పలువురు ముఖ్యనాయకులు లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, అల్లంగి రామకృష్ణ, బలిజ కోటేశ్వరరావు పడాల్, ఉమ్మడి జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు పరదాని సురేష్, ఐటీ కమిటీ సభ్యులు సంతోష్ సింగ్, కొన్నేడి లక్మణ్ రావు, శ్రీనివాస్ రెడ్డి, బంగారు రాందాస్, దురియా సాయిబాబా, సీదరి దనేశ్వరావు, ముత్యం ప్రసాద్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.